loading

0%

దూదేకుల కేర్ ఫోర్స్ భవిషత్ కార్యాచరణ ప్రణాళిక

దూదేకుల కేర్ ఫోర్స్ భవిషత్ కార్యాచరణ ప్రణాళిక 

ఈ రోజు గుంటూరులో డీసీఫ్ టీం భవిషత్ ప్రణాళికల గురించి సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది . ఈ కార్యక్రమంలో 

డీసీఫ్ దూదేకుల కులస్తులకు విద్య , వైద్యం , ఉద్యోగ , ఉపాధి అవకాశాలు ఎలా అందించాలి , దీనికోసం ఎటువంటి ఏర్పాట్లు చేయాలి అనే అంశం మీద చర్చించినట్లు డీసీఎఫ్ వ్యవస్థాపకుడు హన్ను భాయ్ తెలిపారు. అలాగే 2027 లక్యంగా దూదేకుల అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలు తయారుచేసినట్లు , దీనికోసం రాష్ట్రవ్యాప్త పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అయన తెలియచేసారు . 

DCF సభ్యులు మాట్లాడుతూ MyDCF యాప్ ఆనతి కాలంలోనే మంచి మన్ననలు పొందుతోందని , అలాగే దూదేకుల కులస్తులకు విద్య , వైద్యం , ఉద్యోగ , ఉపాధి అవకాశాలు అందిచేంత వరకు DCF అప్రతిహతంగా ప్రయత్నం చేస్తుందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో DCF ఆర్గనైజర్స్ షేక్ అల్తాఫ్ , ధర్మారం బాజీ , డి. నాగూర్ వలి , SS రాజ్ , డా II కిరణ్, కాసీంసైదా   మస్తాన్ , గణపరం బాజీ తదితరులు పాల్గొన్నారు.