loading

0%

వేసవిలో బొప్పాయి రోజూ తింటే కలిగే లాభాలివే.. ఆ సమస్యలు దూరం

బొప్పాయి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా సమ్మర్​లో దీనిని డైట్​లో చేర్చుకుంటే ఎన్నో సమస్యలు దూరమవుతాయని చెప్తున్నారు నిపుణులు. అవేంటంటే..

వేసవిలో బొప్పాయిని రెగ్యులర్​ డైట్​లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం.

బొప్పాయిలో ఫైబర్, విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తూ.. హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

బొప్పాయి రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచి సీజనల్ వ్యాధులు రాకుండా హెల్ప్ చేస్తుంది.

బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. పైగా కేలరీలు తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీనిని మీ డైట్​లో చేర్చుకోవచ్చు.

బొప్పాయిలోని నీటి శాత హైడ్రేషన్ సమస్యలను దూరం చేస్తుంది. డీహైడ్రేషన్​ని తగ్గించడంలో ఇది మంచి ఫలితాలు ఇస్తుంది.

స్కిన్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి.. సమ్మర్​ ట్యాన్ సమస్యల్ని దూరం చేస్తుంది. దీనిని డైట్​లోనే కాదు.. ఫేస్​ ప్యాక్​గా కూడా తీసుకోవచ్చు. కంటి ఆరోగ్యానికి కూడా మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.