loading

0%

IPL వాయిదా.. RCBకి ఎంతో మేలు చేసింది!

ఐపీఎల్ వాయిదాతో ఆర్సీబీకి అనుకోని ప్రయోజనం చేకూరింది. కీలక ఆటగాళ్ళైన ఫిల్ సాల్ట్, హెజల్వుడ్, పాటిదార్ గాయాల నుంచి కోలుకునే అవకాశం లభించింది. షెఫర్డ్ వెస్టిండీస్ తరఫున ఆడి తిరిగి రావచ్చు. ఈ విరామం ఆర్సీబీ జట్టును మరింత బలంగా మార్చి, ప్లే ఆఫ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేయడానికి సహాయపడుతుంది.

భారత్‌ పాకిస్థాన్‌ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ఐపీఎల్‌ 2025ను వారం రోజుల పాటు వాయిదా వేసింది బీసీసీఐ. వారం తర్వాత అయినా మ్యాచ్‌లు తిరిగి నిర్వహిస్తారా? అనేదానిపై కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పాక్‌తో యుద్ధంపై ఏదో ఒకటి తేలిన తర్వాతనే మ్యాచ్‌లు ఉండే అవకాశం ఉంది. అయితే.. కొంతమంది క్రికెట్‌ అభిమానులు మరీ ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఐపీఎల్‌ వాయిదా పడటంపై కాస్త ఫీల్‌ అవుతున్నారు. అరెరె.. ఆర్సీబీ చాలా బాగా ఆడుతోంది, పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్‌లో ఉంది, కప్పు సాధించాలనే 17 ఏళ్లు కల ఈసారైన తీరుతుంది అనుకునే టైమ్‌లో ఇలా ఐపీఎల్‌ వాయిదా పడిందే అంటూ తెగ బాధపడిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల బాధలో కూడా నిజం ఉంది.

ఈ సీజన్‌లో ఆర్సీబీ టీమ్‌ బాగా సెట్‌ అయింది. ఎప్పటిలాగే విరాట్‌ కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఫిల్‌ సాల్ట్‌ బాగా ఆడుతున్నాడు, అతను అందుబాటులో లేకుండా జాకబ్‌ బెతెల్‌ అనే కుర్రాడు ఇరగదీస్తున్నాడు. దేవదత్‌ పడిక్కల్‌, కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌, కృనాల్‌ పాండ్యా మిడిల్‌ ఆర్డర్‌లో బాగా ఆడుతున్నారు. టిమ్‌ డేవిడ్‌, రొమారియో షెఫర్డ్‌ సూపర్‌ ఫినిషింగ్‌ ఇస్తున్నారు. పైగా మునుపెన్నడు లేని విధంగా ఈ సీజన్‌లో ఆర్సీబీ బౌలింగ్‌ అత్యాద్భుతంగా ఉంది. భువనేశ్వర్‌ కుమార్‌, జోస్‌ హెజల్‌వుడ్‌, కృనాల్‌ పాండ్యా, సుయాష్‌ శర్మ, యష్‌ దయాల్‌ సూపర్‌గా బౌలింగ్‌ చేస్తున్నారు. దీంతో ఈ సాలా కప్‌ నమ్‌దే అనే ధీమా ప్రతి ఆర్సీబీ ఫ్యాన్‌లో కనిపించింది.

మొత్తం 11 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు గెలిచి 16 పాయింట్లు సాధించింది. 18 సీజన్‌ టైటిల్‌ విన్నర్‌ ఆర్సీబీనే అని అంతా ఫిక్స్‌ అయ్యారు. కానీ, ఇప్పుడు ఐపీఎల్‌ వాయిదా పడింది. మళ్లీ తిరిగి ఐపీఎల్‌ మొదలైనా.. అప్పటి వరకు తమ ఆటగాళ్ల ఫామ్‌, ఫ్లో పోతుందేమో అని భయపడుతున్నారు అభిమానులు. కానీ, వాళ్లు ఒక విషయం గమనించాలి. పైగా చెప్పకున్న ప్లేయర్లలో ఏకంగా నలుగురు గాయాలతో ఉన్నారు. దేవదత్‌ పడిక్కల్‌ ఇప్పటికే టోర్నీకి దూరం అయ్యాడు. అతని స్థానంలో మయాంక్‌ యాదవ్‌ను తీసుకున్నారు. అతను ఎంత వరకు పడిక్కల్‌ రోల్‌ను భర్తీ చేస్తాడో తెలియదు. ఫిల్‌ సాల్ట్‌ జ్వరంతో బాధపడుతున్నాడు. జోష్‌ హెజల్‌వుడ్‌, రజత్‌ పాటిదార్‌ గాయాలతో ఉన్నారు.

మే 3 సీఎస్‌కేతో మ్యాచ్‌ తర్వాత.. నెక్ట్స్‌ లక్నోతో జరిగే మ్యాచ్‌కు వీళ్లంతా అందుబాటులో ఉంటారో లేదో తెలియని పరిస్థితుల్లో ఆర్సీబీ ఉంది. పైగా సీఎస్‌కే తుఫాన్‌ హాఫ్‌ సెంచరీ చేసిన షెఫర్డ్‌ వెస్టిండీస్‌ తరఫున ఆడేందుకు రెడీగా ఉన్నాడు. అతను ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లకు ఉండడు. ఇలా ఆర్సీబీ ఇప్పటి వరకు బాగానే ఆడుతున్నా.. ఇక్కడి నుంచి వాళ్లకు కష్టాలు మొదలయ్యేలా కనిపించాయి. కానీ వాళ్ల అదృష్టం కొద్ది ఐపీఎల్‌ వాయిదా పడింది. మళ్లీ ఐపీఎల్‌ తిరిగి ప్రారంభం అయ్యే సమాయానికి ఫిల్‌ సాల్ట్‌, హెజల్‌వుడ్‌, రజత్‌ పాటిదార్‌ గాయాల నుంచి కోలుకోవచ్చు. షెఫర్డ్‌ వెస్టిండీస్‌ తరఫున ఆడి మళ్లీ టీమ్‌లోకి రావొచ్చు. ఇలా ఆర్సీబీకి ఈ వాయిదా ఎంతో మేలు చేసిందనే చెప్పాలి. కీ ప్లేయర్లు లేకుండా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ ఆడి గెలవడం అంతా ఈజీ కాదు.