loading

0%

ఈడీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది:TASMAC కేసులో సుప్రీంకోర్టు

ఈడీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది:TASMAC కేసులో సుప్రీంకోర్టు

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) లో జరిగిన దాడులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేంద్ర సంస్థ తీసుకున్న చర్యపై స్టే విధించింది.

ప్రభుత్వ సంస్థపై చర్య తీసుకోవడం ద్వారా ED అన్ని పరిమితులను దాటిందని ,రాజ్యాంగం,సమాఖ్య నిర్మాణాన్ని ఉల్లంఘించేలా వ్యవహరిస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్,జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. 

TASMACలో జరిగిన వెయ్యి కోట్ల కుంభకోణంలో ED దర్యాప్తు కొనసాగించడానికి అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు EDకి నోటీసు జారీ చేసింది.

‘‘ఈ నేరం కార్పొరేషన్‌పై ఎలా అవుతుంది? మీరు వ్యక్తులపై నమోదు చేసుకోవచ్చు..కార్పొరేషన్‌పై క్రిమినల్ కేసునా? మీ ED అన్ని పరిమితులను దాటుతోంది’’  అని CJI గవాయ్ వ్యాఖ్యానించారు.

కొంతమంది తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారులు అధిక ధరలకు మద్యం అమ్మడం, టెండర్ ప్రక్రియలో మోసం చేయడం ,లంచాలు తీసుకోవడంలో పాల్గొన్నారని ED ఆరోపించింది. ఈ చర్యల వల్ల రూ. 1,000 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆరోపించింది.మార్చి 6 ,8 తేదీల్లో ED అనేక TASMAC ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది.

ఏప్రిల్ 23న మద్రాస్ హైకోర్టు పిటిషన్లను తోసిపుచ్చుతూ ED తన దర్యాప్తును కొనసాగించడానికి అనుమతిస్తూ జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను సీఎం స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ,TASMAC సవాలు చేయడంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.