EPFO: పీఎఫ్ డబ్బులను ఏటీఎం నుంచి విత్ డ్రా చేయడం ఎలా.. స్టెప్ బై స్టెప్ తెలసుకునే ప్రయత్నం చేద్దాం
కేంద్రం ప్రభుత్వం ఇటీవల ఈపీఎఫ్ఓ 3.0 పేరిట విప్లవాత్మకమైన మార్పులు చేపట్టింది. ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ ద్వారా అనేక ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులు తమ కష్టార్జితాన్ని డిపాజిట్ చేస్తుంటారు. ఈ డబ్బు వారికి రిటైర్మెంట్ అనంతరం సౌకర్యవంతమైన జీవితం కోసం లభిస్తుంది. ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ఎంప్లాయిస్ తమ అత్యవసర పరిస్థితులలో ఉపసంహరించుకొని వాడుకోవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను అత్యవసర సమయాల్లో బయటకు తీయాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎలాంటి పరిస్థితుల్లో ఎంత మేర డబ్బు ప్రావిడెంట్ ఫండ్ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- వివాహం కోసం మీ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే దీనికోసం మీరు స్వయంగా కానీ, మీ సంతానం, సోదరీ లేదా సోదరుడి వివాహం కోసం డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం కనీసం ఏడు సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. . అలాగే మీ పిఎఫ్ మొత్తంలో 50% డ్రా చేసుకోవచ్చు.
- అనారోగ్య పరిస్థితుల్లో కూడా మీ పిఎఫ్ డబ్బులను ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం మీరు స్వయంగా కానీ మీ జీవిత భాగస్వామి పిల్లలు లేదా తల్లిదండ్రులు అనారోగ్యం పాలైనట్లయితే 1 లక్ష రూపాయల వరకు పిఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు లేదా ఆరు నెలల సమానమైన బేసిక్ వేతనం పొందే అవకాశం ఉంది.
- గృహ నిర్మాణం కోసం కూడా మీరు పిఎఫ్ డబ్బులను డ్రా చేసుకోవచ్చు దీని కోసం కనీసం ఐదు సంవత్సరాలు మీరు సర్వీసులో ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మీ ఫీఎఫ్ డబ్బులు దాదాపు 90 శాతం వరకు బయటకు తీసి అవకాశం ఉంటుంది.
- పిల్లల చదువు కోసం కూడా మీరు పిఎఫ్ డబ్బులను డ్రా చేసుకోవచ్చు అయితే దీనికోసం ఏడు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి అప్పుడు మీ పిఎఫ్ లో 50 శాతం వరకు డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది.
- మీరు ఉద్యోగం మానేసిన తర్వాత 60 రోజులు వరకు ఖాళీగా మరో ఉద్యోగం లో చేరకుండా ఉన్నట్లయితే మీ పిఎఫ్ డబ్బులను మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. . ఇవి మీ అత్యవసర సమయాల్లో ఉపయోగపడతాయి.
- ఇక రిటైర్మెంట్ సమయంలో 58 సంవత్సరాల అనంతరం మీ మొత్తం పిఎఫ్ డబ్బును బయటకు తీసుకునే అవకాశం లభిస్తుంది.
- దురదృష్టవశాత్తు ఉద్యోగి మృతి చెందినట్లయితే వారి నామిని లేదా కుటుంబ సభ్యులకు పిఎఫ్ డబ్బు పెన్షన్ అలాగే ఇన్సూరెన్స్ ప్రయోజనాలతో కలిపి లభిస్తుంది.
ఇటీవల ఈపీఎఫ్ఓ 3.0 పేరిట కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఏటీఎం ద్వారా అదే విధంగా యూపీఐ ద్వారా కూడా డబ్బులను డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది. . అయితే ఇంకా ఈ పద్ధతి అమల్లోకి రాలేదు. ప్రస్తుతం మాత్రం ఆన్లైన్ ద్వారా డబ్బులు డ్రా చేసుకున్న అవకాశం లభిస్తుంది. పైన పేర్కొన్న పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే మీరు పిఎఫ్ డబ్బులను డ్రా చేసుకోవచ్చు.