loading
0%20,Jun-2025
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వేరే కంపెనీకి పోర్టింగ్ ఎలా మారాలి..
ఆరోగ్య బీమా అనేది వైద్య ఖర్చుల కోసం ఆర్థిక రక్షణ కల్పించే ఒక రకమైన బీమా. దీనిలో, మీరు ఒక బీమా సంస్థకు (ఇన్సూరెన్స్ కంపెనీ) ప్రీమియం చెల్లిస్తారు. ఆ సంస్థ మీ వైద్య ఖర్చులను, లేదా కొంత భాగాన్ని కవర్ చేస్తుంది. సాధారణంగా, ఆరోగ్య బీమాలో ఆసుపత్రిలో చేరడం, వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు, మందుల ఖర్చులు, ఇతర వైద్య సంబంధిత ఖర్చులు ఉంటాయి. మీరు బీమా చేసిన మొత్తానికి లోబడి ఈ ఖర్చులు కవర్ అవుతాయి. ఈ రోజుల్లో ఆరోగ్య బీమా చాలా అవసరం. కానీ, మనకు ఉన్న పాలసీ సరిగ్గా లేదని అనిపించినప్పుడు మనం మరో మంచి ఇన్సూరెన్స్ కంపెనీకి మారాలనుకుంటాం. అయితే, ఆరోగ్య బీమా ప్రయోజనాలు కోల్పోకుండా ఆరోగ్య బీమాను వేరే కంపెనీకి ఎలా మార్చుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు ఆరోగ్య బీమాను వేరే కంపెనీకి మార్చుకోవాలని అనుకున్నప్పుడు బీమా పోర్టింగ్ అనే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక బీమా కంపెనీ నుంచీ ఇంకొక బీమా కంపెనీకి మారడం. ఇది పూర్తిగా చట్టబద్ధమైనది. భారత ప్రభుత్వానికి చెందిన బీమా నియంత్రణ సంస్థ IRDAI దీనిని అనుమతిస్తుంది.
బీమా పోర్టింగ్
ఆరోగ్య బీమా పాలసీని మరొక కంపెనీకి మార్చడాన్ని బీమా పోర్టింగ్ అంటారు. ఇది పాలసీ గడువు తేదీకి కనీసం 45 రోజుల ముందు చేయాలి. మీరు మీ ప్రస్తుత బీమా సంస్థ ప్రయోజనాలు సరిగ్గా లేవని అనుకుంటే లేదా మెరుగైన సేవలు లేదా తక్కువ ప్రీమియంలు కోరుకుంటే బీమా పోర్టింగ్ చేయవచ్చు.