loading

0%

ఇండియాలోనే ఖరీదైన, లగ్జరీ ట్రైన్.. 7-స్టార్ హోటల్ ఫెసిలిటీస్‌.. అంతా రాజ వైభోగం.. ఛార్జీ ఎంతంటే ?

ఇండియాలోనే ఖరీదైన, లగ్జరీ ట్రైన్.. 7-స్టార్ హోటల్ ఫెసిలిటీస్‌.. అంతా రాజ వైభోగం.. ఛార్జీ ఎంతంటే ?

సాధారణంగా ఇండియాలో చాలా మంది తక్కువ ఛార్జీల కోసం ట్రైన్‌ జర్నీలు చేస్తుంటారు. కానీ అన్ని రైళ్లకు ఇది వర్తించదు. రాజ భవనంలో నివసించే అనుభూతి, మహా రాజులా ప్రయాణించే అనుభవాన్ని అందించే ట్రైన్‌ కూడా ఒకటి ఉంది.

No Takers for Maharaja-Like Journey as Indian Luxury Trains Battle Low  Occupancy, Covid Deals Fresh Blow | India News - News18

సాధారణంగా ఇండియాలో చాలా మంది తక్కువ ఛార్జీల కోసం ట్రైన్‌ జర్నీలు చేస్తుంటారు. కానీ అన్ని రైళ్లకు ఇది వర్తించదు. రాజ భవనంలో నివసించే అనుభూతి, మహా రాజులా ప్రయాణించే అనుభవాన్ని అందించే ట్రైన్‌ కూడా ఒకటి ఉంది. అదే మహారాజా ఎక్స్‌ప్రెస్ (Maharaja Express). ఇది పట్టాలపై కదిలే ‘సెవన్‌‌ స్టార్‌ హోటల్‌’లా ఉంటుంది. 2010లో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ మహారాజా ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొచ్చింది. ఇది ఇండియాలో అత్యంత ఖరీదైన, లగ్జరీ రైలు.  

दुनिया के सबसे महंगे रेलवे सफर, 1 रात का किराया 6 महीने की सैलरी के बराबर!  देखें पटरी पर दौड़ते 5 स्टार होटल - Most expensive train rides in world maharaja  express

భారతదేశ గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శించడానికి మహారాజా ఎక్స్‌ప్రెస్ ప్రవేశ పెట్టారు. ఇది వరల్డ్‌ క్లాస్‌ కంఫర్ట్‌, రాయల్‌ వైబ్‌ అందిస్తుంది. ఇండియాని ఎక్స్‌ప్లోర్‌ చేయానుకునే టూరిస్ట్‌ అయినా, కింగ్‌ లాంటి లైఫ్‌ స్టైల్‌ని ఎక్స్‌పీరియన్స్‌ చేయాలనుకున్నా ఇందులో ట్రావెల్‌ చేయవచ్చు. 

PHOTOS: भारतीय रेल का गर्व है ये 'खास ट्रेन', महल से कम नहीं इसकी सुविधाएं,  फिर भी सफर नहीं कर रहे यात्री - indian railways indian luxury trains battle  low occupancy maharaja

మహారాజా ఎక్స్‌ప్రెస్ ఫీచర్లు 

రాయల్ సూట్స్, డీలక్స్ క్యాబిన్స్: ప్రైవేట్ బాత్రూమ్‌లు, LCD టీవీలు, వైఫై, క్లైమేట్ కంట్రోల్ వంటి అడ్వాన్స్‌డ్‌ కంఫర్ట్స్‌తో రూపొందిన క్యాబిన్‌లు ఉంటాయి.

పర్సనల్‌ అటెండెంట్: ప్రతి ప్రయాణీకుడికి పర్సనలైజ్డ్‌ సర్వీస్‌ అందించేందుకు స్పెషల్ అటెండెంట్ ఉంటారు.

ट्रेन नहीं पटरियों पर दौड़ता 5 स्टार होटल! देखिये देश की सबसे महंगी ट्रेन,  किराया हवाई जहाज से कई गुना ज्यादा - maharaja express india most expensive  train ticket ...

డైనింగ్ కార్స్‌: రెండు రెస్టారెంట్లు బెస్ట్‌ చెఫ్‌లు రూపొందించిన మెనూలతో టేస్టీ ఇండియన్‌, ఇంటర్నేషనల్‌ మీల్స్‌ అందిస్తాయి.

బార్ కార్: ప్రీమియం డ్రింక్స్‌, రిలాక్సింగ్‌ యాంబియన్స్‌తో కూడిన స్టైలిష్ లాంజ్ ఉంటుంది.

అదనపు సౌకర్యాలు: ట్రైన్‌ స్పా, లైబ్రరీ, బిజీ బిజినెస్‌మెన్స్‌ కోసం బిజినెస్‌ సెంటర్‌ అందుబాటులో ఉంటాయి.


రైలు ఎక్కడికి వెళ్తుంది ?

మహారాజా ఎక్స్‌ప్రెస్ భారతదేశంలోని మోస్ట్‌ ఐకానిక్‌, హిస్టారిక్‌ డెస్టినేషన్స్‌ నుంచి ప్రయాణిస్తుంది. ప్రయాణీకులకు దేశంలోని రిచ్‌ హెరిటేజ్‌ని ఎక్స్‌ప్లోర్‌ చేసే అవకాశాన్ని అందిస్తుంది. 

ఇండియన్ పనోరమా టూర్ ప్యాకేజీ:

ఈ టూర్ ప్యాకేజీ ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. 6-రాత్రులు, 7 రోజుల రైలు ప్రయాణంలో జైపూర్- రణతంబోర్, ఫతేపూర్ సిక్రీ - ఆగ్రా - ఓర్చా, ఖజురహో - వారణాసి - ఢిల్లీని కవర్ చేస్తుంది. అక్టోబర్- ఏప్రిల్ మధ్య బయలుదేరుతుంది.

ఇండియన్ స్ప్లెండర్ టూర్ ప్యాకేజీ:

మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ నుండి ఆగ్రా - రణథంబోర్ - జైపూర్ - బికనీర్ - జోధ్‌పూర్ - ఉదయపూర్ - ముంబైలను కవర్ చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ 6-రాత్రులు, 7 రోజులు ఉంటుంది. అక్టోబర్-ఏప్రిల్‌లో బయలుదేరుతుంది.


ట్రెజర్ ఆఫ్ ఇండియా టూర్ ప్యాకేజీ:

ఈ రైలు టూర్ ప్యాకేజ్ 3-రాత్రులు 4-రోజుల్లో ప్రముఖ ప్రాంతాలను కవర్‌ చేస్తుంది. ఢిల్లీలో బయలుదేరి ఆగ్రా, రణథంబోర్, జైపూర్, ఢిల్లీలను కవర్ చేస్తుంది. అక్టోబర్-ఏప్రిల్‌లో ఉంటుంది.

హెరిటేజ్ ఆఫ్ ఇండియా టూర్ ప్యాకేజీ:

రైలు ముంబై నుంచి బయలుదేరి 6-రాత్రులు, 7-రోజులు ప్రయాణిస్తుంది. ఢిల్లీలో ప్రయాణం ముగుస్తుంది. ఇది ముంబై నుంచి ప్రారంభమై ఉదయపూర్ - జోధ్‌పూర్ - బికనీర్ - జైపూర్ - రణతంబోర్ - ఫత్‌పూర్ సిక్రీ (ఆగ్రా) - ఢిల్లీని కవర్ చేస్తుంది. అక్టోబర్-ఏప్రిల్‌లో ఉంటుంది. 

ఎంత ఖర్చవుతుంది?

మహారాజా ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో అత్యంత ఖరీదైన రైలు. ధర రూట్, క్యాబిన్ టైప్‌, ట్రిప్ వ్యవధి (సాధారణంగా 4 నుంచి 8 రోజులు)పై ఆధారపడి ఉంటుంది. ప్రారంభ ఛార్జీ డీలక్స్ క్యాబిన్‌కు ఒకరికి దాదాపు రూ.3 లక్షలు ఉంటుంది. ప్రెసిడెన్షియల్ సూట్‌లో అయితే ఒకరికి రూ.19 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ధరలలో భోజనం, గైడెడ్ టూర్లు, పూర్తి లగ్జరీ ప్యాకేజీని అందించే ఆన్‌బోర్డ్ సర్వీసులు ఉన్నాయి.