loading
0%15,Jul-2025
తాహెరా సుల్తానా ! ది ఫేక్ దూదేకుల
ఉద్యోగ అవకాశం
కోసం కులాన్ని మార్చుకుని దూదేకుల సమాజానికి రావాల్సిన అన్ని అవకాశాలను కొల్లగొట్టిన
కుటుంబం . ఈ వివరాల గురించి దూదేకుల సమాజం భగ్గుమంటోంది . అయినా బయట ప్రపంచానికి తెలియని
ఇలాంటి తాహెరా సుల్తానాలకు కొదవేలేదు.
మనం మనం ఒకటే అని ఎందుకు అంటున్నారో ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలి.
కొన్ని వందల మంది ఇతర కులస్తులు (ముస్లిం సామజిక వర్గంలో ) మన దూదేకుల సంఘీయుల అవకాశాలను
కొల్లగొట్టిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ,మనం నిమ్మకు నీరెత్తినట్టు నట్టు ఉన్నాం
. ఎందుకంటే దీనివల్ల ఏ ధనవంతుడైన దూదేకుల కులస్తుడు నష్టపోవటం లేదు , ఏ దూదేకుల రాజకీయ
నాయకుడు నష్టపోవటం లేదు , కేవలం దిగువ , మధ్యతరగతి దూదేకుల కులస్తుడికే నష్టం వాటిల్లుతోంది.
ఇలా నష్టం కల్గించే
అంశాలను గాలికి వదిలేసి మనలో మనమే అవసరంలేని , జాతికి ఉపయోగంలేని వ్యక్తిగత గుర్తిపుకోసం
, పనిచేసే వారికి వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటున్నాం.
తాహెరా సుల్తానా
లాంటి వారు ఇలాంటి అతి పెద్ద మోసాలకు , నేరాలకు సులభంగా పూనుకోవటానికి కారణం ? మనం
ఏర్పాటు చేసుకున్న కుల ధ్రువీకరణ విధానం .
మండలాల వారీగా
నాయకుల్ని నియమించుకుని , వారు ఎవర్ని నిర్ణయిస్తే వారు దూదేకుల కులస్తులుగా చలామణి
చేసాము. కానీ సరైన రికార్డులు మైంటైన్ చేయలేదు . ఉంటె తాహెరా సుల్తానా లాంటి మోసకారులకు
ఎవరు తోడ్పాటు అందిస్తున్నారో ఇప్పటికే బయకు వచ్చిఉండేది. మాన్యూవల్ గా లెటర్ ఇస్తున్నటువంటి కొంతమంది నాయకులు
డబ్బు ఆశకు లోబడో , ప్రలోభాలకు లొంగో దొంగ కన్ఫర్మేషన్ లెటర్స్ ని ఇస్తున్నారు. కానీ
సగటు దూదేకుల బిడ్డల జీవితాలను తాకట్టుపెడుతున్నారని ఆలోచించలేకపోతున్నారు.
దూదేకుల
కేర్ ఫోర్స్ ఇప్పటికే ఇలాంటి మోసాలను అరికట్టడం కోసం ఆన్లైన్ కన్ఫర్మేషన్ లెటర్ విధానాన్ని
ప్రవేశపెట్టడం జరిగింది.
ఆన్లైన్ కన్ఫర్మేషన్
లెటర్ ద్వారా ఎవరైతే ఆర్డర్ కోఆర్డినేటర్ లెటర్
ఇష్యూ చేస్తాడో ,అతని డేటా, అతను లెటర్ ఇచ్చిన తేదీ మరియు సమయం ఎవరికి ఇచ్చారు
అనేటువంటి వివరాలు సర్వర్లో నమోదు చేయబడతాయి. ఈ సర్వర్లో నమోదు చేయబడిన అంశాలు సెక్యూర్డుగా ఉంటాయి
కాబట్టి తర్వాత కాలంలో ఆ సర్టిఫికెట్లలో ఎటువంటి
మోసం ఉన్నాగాని ఆ కోఆర్డినేటర్ బాధ్యత వహించాల్సి
ఉంటుంది. అలాగే దూదేకులకే ఫోర్స్ ఆధ్వర్యంలో
చేపట్టినటువంటి జనాభా లెక్కలు కార్యక్రమం ద్వారా నమోదు చేయబడుతున్న దూదేకుల జనాభా లెక్కలు ఇలాంటి కుల దృవీకరణ పత్రాల మోసాలను
అరికట్టడానికి కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది.
ఎప్పుడైనా ఎమ్మార్వో కు గాని ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి సిబ్బందికి గాని దూదేకుల కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చేటప్పుడు
ఎటువంటి అనుమానం కలిగిన వారు దూదేకులకేర్ ఫోర్స్ డాట్ కామ్ లోని జనాభా లెక్కల ద్వారా
ధ్రువీకరించుకోవచ్చు.
ఇప్పటికైనా
మనం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మనం మోసపోయింది
చాలు మనలో మనం శత్రుత్వాలు పెంచుకుంది చాలు.
ఈరోజు దూదేకుల కేర్ ఫోర్స్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం దూదేకుల
సామాజిక వర్గం యొక్క స్థితిగతులు మార్చడానికి
మరియు దూదేకుల సామాజిక వర్గం యొక్క అవకాశాలను కాపాడుకోవటం కోసం. దూదేకుల సామాజిక వర్గం యొక్క ఆర్థిక పరిస్థితులు
మార్చటం కోసం ,దూదేకుల సామాజిక వర్గంలోని యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం కోసం మాత్రమే
దూదేకులకేర్ ఫోర్స్ పనిచేస్తుంది అనే అంశాన్ని గుర్తించాల్సిందిగా ప్రతి ఒక్క నాయకుడిని,
ప్రతి ఒక్క సంఘీ పేరుపేరునా చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. మనల్ని మనం కాపాడుకోలేని పక్షంలో ఇలాంటి తాహెర సుల్తానా
లాంటి గద్దలు మన అవకాశాల్ని తనకు పోతూనే ఉంటాయి. ఇది కేవలం చిన్న ఉదాహరణ మాత్రమే. రాజకీయాల్లో కూడా మనకు రావాల్సిన హక్కుల్ని ఇప్పటికే
తన్నుకు పోవడం జరిగింది. మనకు రావాల్సిన నిధులు
మనకు రాకుండా -
మనమంతా ఒకటే
అనే ముసుగులో దోచుకోవడం జరుగుతోంది . వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే గ్రామస్థాయి నుంచి
కుటుంబస్థాయి వరకు మనం మన దూదేకుల యువతను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది.
దూదేకుల
కేర్ ఫోర్స్ ఒక సంస్థ కాదు , దూదేకుల సామజిక
వర్గానికి పట్టిన చీడల్ని పీడల్ని సమూలంగా ప్రక్షాళన చేయటానికి ఉద్భవించిన వ్యవస్థ.
జై దూదేకుల .
మీ హన్ను భాయ్
దూదేకుల కేర్ ఫోర్స్
Download MyDCF app