loading

0%

కోవూరు మండలం డీసీఎఫ్ అథరైజ్డ్ కోఆర్డినేటర్‌గా అబ్దుల్ గఫూర్ నియామకం

*కోవూరు మండలం డీసీఎఫ్ అథరైజ్డ్ కోఆర్డినేటర్‌గా షేక్ అబ్దుల్ గఫూర్ నియామకం* కోవూరు మండల దూదేకుల కేర్ ఫోర్స్ (DCF) అథరైజ్డ్ కోఆర్డినేటర్‌గా అబ్దుల్ గఫూర్‌ ను నియమించారు. ఈ నియామకానికి సంబంధించిన నియామకపత్రాన్ని డీసీఎఫ్ ఫౌండర్ హన్ను భాయ్, స్టేట్ ఆర్గనైజర్ షేక్ అల్తాఫ్, జిల్లా ఆర్గనైజర్లు షేక్ మస్తాన్, హాజరత్ అలీ ఆధ్వర్యంలో అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, అబ్దుల్ గఫూర్ కు సామాజిక సేవా రంగంలో అనుభవం ఉందని, డీసీఎఫ్ లక్ష్యాలు, ఆశయాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కోవూరు మండలంలో సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు దూదేకుల సామాజికవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అబ్దుల్ గఫూర్ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, డీసీఎఫ్ ఫౌండర్ హన్ను భాయ్ నాయకత్వంలో సంస్థ అభివృద్ధికి, మండల స్థాయిలో దూదేకుల ప్రజలకు సేవ చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎఫ్ కోఆర్డినేటర్స్, షేక్ మల్లి బాబు, షేక్ నజీర్, షేక్ రహంతుల్లా, షేక్ ఖాదర్ మస్తాన్, మరియు సభ్యులు పాల్గొని నూతన కోఆర్డినేటర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.