loading
0%01,Feb-2026
గ్రూప్–1లో డీఎస్పీగా ఎంపికైన కుమారి రిజ్వానా -94 డైమండ్ గ్రూప్‌కు అపూర్వ గర్వకారణం
పోరుమామిళ్ల మండలం, బురగమానుపల్లి గ్రామానికి చెందిన 94 బ్యాచ్ పీసీ – శ్రీ 411 హుస్సేన్ గారి కుమార్తె కుమారి రిజ్వానా గారు, ఇటీవల విడుదలైన గ్రూప్–1 పరీక్ష ఫలితాలలో డీఎస్పీ వంటి అత్యున్నత ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ఘన విజయం అందుకున్నారు.
ఈ విశిష్ట విజయంతో 94 డైమండ్ గ్రూప్‌కు అపూర్వ గర్వకారణంగా నిలిచిన కుమారి రిజ్వానాకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కఠినమైన పోటీతో కూడిన గ్రూప్–1 పరీక్షల్లో అత్యున్నత స్థాయి ఉద్యోగాన్ని సాధించడం ఆమె అంకితభావం, క్రమశిక్షణ మరియు పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.
అలాగే, క్రమశిక్షణ, విలువలు, విద్యలకు ప్రాధాన్యం ఇస్తూ పిల్లలను ఉన్నత శిఖరాలకు చేర్చిన తండ్రి శ్రీ హుస్సేన్ గారికి ప్రత్యేక ప్రశంసలు అందుతున్నాయి. వారి మార్గదర్శకత్వమే ఈ విజయానికి బలమైన పునాదిగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.
కుమారి రిజ్వానా గారు తన సేవల ద్వారా సమాజానికి మరింత మేలు చేకూర్చాలని, ఆమె భవిష్యత్తు మరింత ఉజ్వలంగా, విజయవంతంగా ఉండాలని గ్రామస్తులు, 94 డైమండ్ గ్రూప్ సభ్యులు హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నారు.