loading

0%

మంగళగిరిలో టీడీపీ బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌కు దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అల్తాఫ్ హాజరు

మంగళగిరిలో టీడీపీ బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌కు దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అల్తాఫ్ హాజరు

మంగళగిరి, 06 ఫిబ్రవరి 2026:

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ఈస్ట్ గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు గారి ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి పనబాక లక్ష్మీ గారు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహులు యాదవ్ గారు, తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పలువురు చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

వర్క్‌షాప్ సందర్భంగా బూత్ స్థాయి నిర్వహణ, పార్టీ బలోపేతం, ప్రజలతో నిత్య సంబంధం వంటి అంశాలపై గౌరవ ఎమ్మెల్యే గారు కీలక సూచనలు, సలహాలు అందించారు. అనంతరం యువ నాయకులు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారితో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అల్తాఫ్ ప్రత్యేకంగా పాల్గొని, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీల పాత్ర పోషించడం. దూదేకుల వర్గంలో అవకాశంగా నిలిచింది. బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని నాయకులు అభిప్రాయపడ్డారు.