loading
0%08,Feb-2026
కలువాయి మండల డిసిఫ్ ACO గా, షేక్ రహమతుల్లా నియామకం
నుకనపల్లి గ్రామం, కలువాయి మండలం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కు చెందిన
షేక్ రహమతుల్లా (తండ్రి: హసన్ షాయిబ్) ను ఈ రోజు అధికారికంగా కలువాయి మండల డీసీఎఫ్ అథరైజ్డ్ కోఆర్డినేటర్ (ACO) గా నియమించడం జరిగింది.
ఈ నియామక కార్యక్రమంలో స్టేట్ ఆర్గనైజర్ షేక్ అల్తామ్, జిల్లా ఆర్గనైజర్లు మస్తాన్, హాజరత్ అలీ, అలాగే మండల కోఆర్డినేటర్లు మల్లి బాబు, నజీర్, అల్తాఫ్ తదితరులు పాల్గొని, షేక్ రహమతుల్లాకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, షేక్ రహమతుల్లా సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సంఘటనా సామర్థ్యం కలువాయి మండలంలో డీసీఎఫ్ కార్యకలాపాల విస్తరణకు ఎంతో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలకు మరియు సంస్థకు మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు.