loading
0%17,Feb-2026
కరాటే పోటీల్లో పతకాలు సాధించిన రిజ్వానాకు అభినందనలు
పట్టణంలో నిర్వహించిన కరాటే పోటీల్లో పతకాలు సాధించిన రిజ్వానాను గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో టిడిపి నాయకురాలు బీసీ ఇందిరా రెడ్డి అభినందించారు.
అవుకు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన దూదేకుల రంగప్ప, బాల హుస్సేన్ బి దంపతుల రెండవ కుమార్తె రిజ్వాన, గ్రాప్లింగ్‌లోని జీఐ (GI), నోగి (No-GI) విభాగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించడం విశేషమని ఆమె ప్రశంసించారు.
ఈ సందర్భంగా బీసీ ఇందిరా రెడ్డి రిజ్వానాను సత్కరించి రూ.15 వేల నగదు ప్రోత్సాహం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి అవుకు మండల అధ్యక్షులు ఉగ్రసేనారెడ్డి పాల్గొన్నారు.