loading
0%15,Dec-2024
హైదరాబాద్ నగరంలో గతకొన్ని రోజులుగా బుల్డోజర్లు హడలెత్తిస్తున్నా యి. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు బుల్డోజర్లుతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. దీంతో బుల్డోజర్ పేరు విన్నా.. దాని అలకిడి విన్నా నగర ప్రజలు వణికిపోతు న్నారు.
ఈ క్రమంలో తాజాగా.. హీరో నందమూరి బాల కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇళ్లకు త్వర లోనే బుల్డోజర్లు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఇది అక్రమ నిర్మా ణాలకు సంబ ధించినది కాదు. నగరంలో రోడ్డు విస్తరణ చేపట్టగా..
అందులో బాలకృష్ణ, జానారెడ్డి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ప్రముఖు లు తమ నివాస స్థలాలను కోల్పోనున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయా ఇండ్లకు మార్కింగ్ చేసారు.
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ప్రణాళికలు రెడీ చేసుకుంది.