loading
0%17,Apr-2025
ఆంధ్రప్రదేశ్లో మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీని కూటమి ప్రభుత్వం చేపట్టింది.
రాష్ట్ర వ్యాప్తంగా 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. కేటాయించిన 30 స్థానాల్లో 25 మంది తెదేపా నాయకులు, నలుగురు జనసేన, ఒక భాజపా నేతకు నామినేటెడ్ పదవులు దక్కాయి. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.