loading

0%

110 మంది జేఈఈ అభ్యర్థుల ఫలితాలు నిలిపివేత

JEE (Main) session 2 Results | ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ (మెయిన్) సెషన్-2 ఫలితాల్లో (JEE Main 2025 Results) భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పర్సంటైల్ స్కోరును వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 110 మంది జేఈఈ అభ్యర్థుల ఫలితాలు నిలిపివేసింది. వారు అక్రమాలకు పాల్పడ్డారని, ఫోర్జరీ పత్రాలు ఉపయోగించినట్లు గుర్తించామని ఎన్టీఏ అధికారులు తెలిపారు.

5.. ລ້ 2 93.102, 5- 80.383, 4-79.431, 2-61.15, ఎస్టీ-47.90 పర్సంటైల్ స్కోర్ను కటాఫ్ నిర్ణయించారు. ఈ స్కోర్కు సమానం, అంతకంటే ఎక్కువ స్కోర్ పొందినవారు మాత్రమే మే 18వ తేదీన జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. రెండు విడతల్లో కలిపి మొత్తం 24 మంది 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. అడ్వాన్స్డ్ పరీక్షకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఇదిలాఉంటే.. తొలుత గురువారమే జేఈఈ (మెయిన్) రెండో సెషన్ పేపర్ -1కు సంబంధించిన తుది కీని జాతీయ పరీక్షల మండలి(NTA) విడుదల చేసినప్పటికీ.. కొన్ని గంటల్లోనే తొలగించింది. ఇందుకు కారణమేంటో తెలపకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురైన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం ఉదయం స్పందించిన ఎన్టీఏ.. శనివారం లోగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు 'ఎక్స్' వేదికగా ప్రకటించింది. అలాగే, ఈ మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది కీ విడుదల చేస్తామని ప్రకటించడంతో విద్యార్థులు ఎదురు చూశారు. అయితే, తుది కీని సైతం చెప్పిన సమయం కన్నా గంటకు పైగా ఆలస్యంగా విడుదల చేయడంతో ఎన్టీఏ అధికారుల తీరుపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తంచేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.