నేటి వార్తల ముఖ్యాంశాలు : Andhra Pradesh
- నేడు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
- ▪️రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ.. గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ.
- ▪️రానున్న 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాభివృద్ధి కోసం 3.73 లక్షల కోట్లు నిధులు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
- ▪️శాసనసభ నిర్మాణానికి 617.33 కోట్లతో L1 బిడ్డర్ గా ఎల్ & టి సంస్థ.. హైకోర్టు భవనానికి 786.05 కోట్లతో ఎన్సీసీ సంస్థ L1 బిడ్డర్ గా నిలిచింది.
- ▪️ఈనెల 28, 29 జరగనున్న వివిధ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో విడుదల.
- ▪️ మే 8వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం.
- ▪️డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి 42 నుంచి 44 కు పెంపు. జూన్ 1, 2024 కటాఫ్ తేదీ.
- ▪️ఏపి జైళ్లలో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీల్లో క్షమాభిక్షకు అర్హులైన, సత్ప్రవర్తన కలిగిన వారి వివరాలు పంపాలని జైళ్ళ శాఖ డీజీని ఆదేశించిన ప్రభుత్వం.
- ▪️బిల్లుల విషయంలో రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించడం బాధాకరం.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తీవ్ర వ్యాఖ్యలు.
- ▪️వక్ఫ్ ఆస్తులను డినోటిఫై చేయం.. తదుపరి విచారణ మే 5వ తేదీ వరకు బోర్డులో ఎలాంటి నియామకాలు చేపట్టబోమని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం.