loading
0%13,May-2025
బ్యాంకులో డిగ్రీతోనే ఉద్యోగాలు..శాలరీ రూ.6.5 లక్షలు, అప్లై చేశారా..
బ్యాంకు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా IDBI బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎంత వయస్సు ఉండాలి, వేతనాలు ఎలా ఉంటాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అనేక మంది యువతకు కూడా బ్యాంకుల్లో ఉద్యోగాలు చేయాలని ఉంటుంది. అలాంటి వారికి శుభవార్త వచ్చేసింది. ఈ క్రమంలోనే తాజాగా IDBI బ్యాంక్ 2025-26కి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), గ్రేడ్ 'O' పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 676 ఖాళీలను భర్తీ చేయనున్న ఈ ప్రక్రియకు మే 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, వేతనాలు ఎలా ఉంటాయనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఈ నియామాల కోసం దరఖాస్తు ప్రక్రియ మే 8, 2025 నుంచి మొదలు కాగా, మే 20, 2025 వరకు కొనసాగుతుంది. పరీక్ష జూన్ 8న నిర్వహించబడుతుంది. ఈ క్రమంలో అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా త్వరగా అప్లై
https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx
చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి..
ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇక వయోపరిమితి గురించి మాట్లాడుకుంటే, అభ్యర్థి వయస్సు మే 1, 2025 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంత జీతం వస్తుంది, ఇంక్రిమెంట్ ఎలా ఉంటుంది..
గ్రేడ్ 'O'గా ఉద్యోగాల్లో చేరిన తర్వాత, జీతం కంపెనీ ఖర్చు (CTC) ఆధారంగా ఏడాదికి రూ. 6.14 లక్షల నుంచి రూ. 6.50 లక్షల (క్లాస్ A నగరం) మధ్య ఉంటుంది. వార్షిక జీతం పెంపు అనేది వారి పనితీరు ఆధారంగా బ్యాంకు ప్రకారం నిర్ణయించబడుతుంది. దీని కోసం ఇతర పారామితులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రొబేషన్ వ్యవధి
పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. IDBI బ్యాంకులో గ్రేడ్ "O"గా ఎంపికైన అభ్యర్థులు మొదటగా ఒక సంవత్సరం ప్రొబేషన్ పీరియడ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దశలో వారి సామర్థ్యాలను, ఉద్యోగ నిబద్ధతను పరిశీలిస్తారు. ఆ క్రమంలో బ్యాంకు విధానాల ప్రకారం సమయానుసారంగా మారవచ్చు. గ్రేడ్ "O" అభ్యర్థులు కనీసం 3 సంవత్సరాల సర్వీస్ పూర్తైన తర్వాత, తదుపరి స్థాయి అయిన గ్రేడ్ "A"కి ప్రమోషన్ అవుతారు. అయితే, ఈ ప్రక్రియ అభ్యర్థి పనితీరు, ఖాళీల లభ్యత, బ్యాంకు విధించిన ఇతర ప్రమాణాల ఆధారంగా ఉంటుంది.