loading

0%

CBSE రిజల్ట్స్ వచ్చేశాయ్: మన విజయవాడ అరుదైన ఘనత

CBSE రిజల్ట్స్ వచ్చేశాయ్: మన విజయవాడ అరుదైన ఘనత

CBSE Class 12 results: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. సీబీఎస్ఈ బోర్డ్ కొద్దిసేపటి కిందటే వీటిని విడుదల చేసింది. ఈ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌లో పొందుపరిచింది.

సీబీఎస్ఈకి చెందిన https://results.cbse.nic.in/

లింక్‌లో పరీక్షల ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.

దీనితో పాటు results.cbse.nic.in, cbseresults.nic.in

వెబ్‌సైట్ల ద్వారా కూడా విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.

దీనికి అదనంగా డిజిలాకర్, ఉమంగ్ యాప్‌ను ఓపెన్ చేయడం ద్వారా కూడా విద్యార్థులు పరీక్ష ఫలితాలను తెలుసుకునే వెసలుబాటు కల్పించింది సీబీఎస్ఈ బోర్డ్. డిజిలాకర్ లింక్ digilocker.gov.in. Also Read "Today's Gold Rates:భారీగా తగ్గిన బంగారం ధరలు..హైదరాబాదులో పసిడి ధర ఇలా..!!" డిజిలాకర్‌ ద్వారా తెలుసుకోవాలంటే విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ నంబర్, సెక్యూరిటీ పిన్, పుట్టినతేదీ వివరాలను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్), ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తంగా 16,92,794 మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రాశారు. 14,96,307 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఉత్తీర్ణత శాతం 88.39 రికార్డయింది. గత ఏడాదితో పోల్చుకుంటే 0.41 శాతం మేర పెరిగింది. గత ఏడాది 16,21,224 మంది పరీక్షలు రాయగా.. 14,26,420 మంది పాస్ అయ్యారు. ఈ పరీక్షల ఫలితాల్లో- విజయవాడ రీజియన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రీజియన్‌ 99.61 శాతం ఫలితాలను సాధించింది. దాదాపుగా పరీక్షలు రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించినట్టయింది విజయవాడ రీజియన్‌లో. కేరళ రాజధాని తిరువనంతపురం రీజియన్ నిలిచింది. ఇక్కడ నమోదైన ఉత్తర్ణత శాతం.. 99.32.