loading

0%

ట్రిపుల్ ఐటీ (IIIT) కోర్సులలో ప్రవేశానికి సమీపిస్తున్న దరఖాస్తు గడువు

మే 20తో ముగియనున్న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ. 

  • ఒక్కసారి సీటు సాధిస్తే... ఆరేళ్ల ఇంజనీరింగ్ విద్య ఫ్రీ.
  • అర్హత గల వారికి ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం.
  • పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు. 
  • ఇప్పటికే 32వేల మంది దరఖాస్తులు నమోదు. 45 వేల దరఖాస్తులు వస్తాయని అంచనా.
  • ఈ ఏడాది మొత్తం 4400 సీట్లు.
  • జూన్ 5న జాబితా విడుదల.. జూన్ 11 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్.

 ఎంపిక విధానం, దరఖాస్తు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఇలా.. 

అర్హత ఉన్న విద్యార్థులు ఆర్టీయూకేటీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. జూన్ 11వ తేదీ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూన్ 30వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. పీహెచ్సీ, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో క్యాంపస్ లో 1000 సీట్లు, అదనంగా ఈడబ్ల్యూఎస్ సీట్లు మరో 100 ఉన్నాయి. మొత్తం 4 క్యాంపస్లలో కలిపి 4,400 సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. స్కాలర్ షిప్ రాని ఓసీ అభ్యర్థులు మాత్రం పీయూసీకి ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ.45,000, ఇంజినీరింగ్ కు ఏడాదికి రూ.50,000 ఫీజుగా నిర్ణయించారు. తెలుగేతర రాష్ట్రాల వారికి 25 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అభ్యర్థులు సంవత్సరానికి ట్యూషన్ ఫీజు రూ.1.50 లక్షలు చెల్లించాలి. పీయూసీ తర్వాత ట్రిపుల్ ఐటీ నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం ఉంది. అప్లికేషన్లో అభ్యర్థి మెరిట్ కేటగిరీ వారిచ్చిన ప్రాధాన్యం ప్రకారం క్యాంపస్ కేటాయిస్తారు. ఒకసారి క్యాంపస్ కేటాయించిన తరువాత బదిలీలు ఉండవు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎస్సీ సబ్ ప్లాన్ వర్గీకరణ ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు.