loading

0%

ఈతపళ్ళు Indian Date Palm Fruit

ఈతపళ్ళు Indian Date Palm Fruit  

వేసవిలో ఈత పళ్ళు విరివిగా లభిస్తాయి.ఈతపండు కాషాయ-ఎరుపు రంగులో ఉండి ఒకే విత్తనాన్ని కలిగి వుంటాయి ఇవి ఎక్కువగా పల్లెటూర్లలో దొరుకుతాయి. 

ఈతపళ్ళ పోషక విలువలు 

ప్రతి 100 గ్రాములకు : శక్తీ : 980KJ, పిండిపదార్థాలు 65 గ్రాములు, చక్కెరలు 53 గ్రాములు, పీచుపదార్థాలు 6 గ్రాములు, కొవ్వు పదార్థాలు 0.4 గ్రాములు, మాంసకృత్తులు 2.5 గ్రాములు, నీరు 21 గ్రాములు, విటమిన్ సి 0.4 మిల్లీగ్రాములు. 

ఈత పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెంగాల్ లో వీటినుండి బెల్లం తయారౌతుంది

ఈత కాయలు ఆరోగ్య ప్రయోజనాలు 

ఈత పండులో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి

  •  ఈత పండ్ల లో సమృద్ధిగా క్యాల్షియం  ఉండుట వలన ఎముకలు బలంగా ఉంటాయి. 
  • ఈతపళ్ళు అల్జీమర్స్ వ్యాధిని తగ్గిస్తాయి.
  • ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్,సుక్రోజ్,ఫ్రక్టోజ్ లు తక్షణ శక్తిని ఇస్తాయి. అలసటను దూరం చేస్తుంది. 
  • ఈత పండ్లు రెగ్యులర్ గా తింటే జీర్ణశక్తి బాగుండి కడుపు నొప్పి మలబద్దకం వంటి జీర్ణ రుగ్మతలను తగ్గిస్తుంది
  • ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన రక్త వృద్ధి జరుగుతుంది. ఎనిమియా తగ్గించును. 
  • ఈత పండ్లను తినటం వలన వేడి తగ్గుతుంది. నిస్సత్తువ,అలసట వంటివి తగ్గుతాయి.
  • ఈత పండ్ల వలన మన శరీరంలో రోగనిరోధాల శక్తి పెరగటమే కాకుండా శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. 
  • ఈత పండ్లు చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి మంచిది
  • జ్వరం మరియు ఫ్లూ చికిత్సలో ఉపయోగిస్తారు.
  • గోనేరియాను నయం చేస్తుందని ఆయుర్వేదంలో ప్రస్తావించబడింది
  • దంత నొప్పికి చికిత్స చేస్తుంది
  • ఎక్కిళ్ళు, వాంతులు, తగ్గించును.
  • ఇమ్యునిటీ బూస్టర్ మరియు భేదిమందు.