loading

0%

దూదేకుల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తాం

కడప టౌన్, నవంబర్ 10 (DCF News):

దూదేకుల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తామని రా ష్ట్ర నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్నరాజా తెలిపారు. ఆదివారం ఎర్ర ముక్కపల్లిలోని జిల్లా కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రా ష్ట్రంలోని దూదేకుల పురోగతి లక్ష్యంగా పని చేస్తామని అందరిని కలుపుకొని ముందుకు పోతా మన్నారు. మిగతా దూదేకుల సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమా జంలో దూదేకుల హక్కుల కోసం, పరిరక్షణ అభివృద్ధి కోసం దూదేకుల వర్గీయుల కోసం ఇతర సంఘాలను కలుపుకొని ఒకే బాట ఒకే మాటగా 157-2015 సంఘం ద్వారా సేవలు అందిస్తామని తీర్మానించారు. ఈ కోవలో నూతనంగా జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్ర క్రియ చేపట్టుతామన్నారు. ఈ కార్య క్రమంలో సంఘం రాష్ట్ర సలహాదారులు ఓబులేసు, కె.వి. హుస్సేన్, రా ష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమాల్ బాషా, జిల్లా ప్రచార కార్యదర్శి ఆర్. బాబు, దూదేకుల నాయకులు ఖాదర్ బాషా, ఖాదరయ్య, హుస్సేనయ్య, అజ్మతుల్లా హోటల్ బాషా, అలీబాషా, అబినందన్ బాషాలు పాల్గొన్నారు. కార్య క్రమానికి ముందుగా ఆంధ్ర భూమి సీనియర్ రీపోర్టర్ ఇమామ్ మృతి పట్ల సంతాపాని తెలిపారు.