loading

0%

ఆత్మకూరు నందు దూదేకుల ముస్లింల ఆత్మీయ సదస్సు విజయవంతం

ఈరోజు ఆత్మకూరు పట్టణము నందువల మార్కెట్ యార్డ్ నందు నూర్ భాషా/దూదేకుల సంఘం మీటింగ్ కల్లూరి పెద్ద మస్తానయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో షేక్ సత్తార్ సాహెబ్ జాతీయ అధ్యక్షులు ముస్లిం నూర్ భాషా/దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం దళిత ముస్లిం, క్రైస్తవ సోదరులందరినీ ఎస్సీ జాబితాలో  కులాన్ని దళితులలో ఉంచాలని  తెలియజేశారుఆ విధంగా చేయడం వల్ల నూర్ భాషా లకు మంచి  జరుగుతుందని తెలియజేశారు డాక్టర్ బాబాన్ మాజీ చైర్మన్ దూదేకుల ఫెడరేషన్. వారు దూదేకుల కులం వారికి సంఘం ద్వారా చాలా మేలు జరుగుతుందని సంఘాన్ని పటిష్టం చేయాలని తెలియజేశారు. సుంకేసుల ఖాదర్ బాషా గారు దూదేకుల సంఘం ఏర్పాటు వల్ల ప్రతి ఒక్క దూదేకుల కుటుంబానికి మంచి జరుగుతుందని అందువలన సంఘాన్ని పటిష్టం చేయాలని తెలియజేశారు. సిద్దయ్య స్టేట్ ప్రెసిడెంట్ దూదేకుల ఉద్యోగుల సంఘం వారు దూదేకుల కులం వారితో వారి కులం పేరుతో పిలవడం అంటే నేరమని దానికి కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేశారు. కన్నయ్య గారు కులాన్ని అందరూ గౌరవించాలని తెలియజేశారు అబ్దుల్ రజాక్ గారు దూదేకుల కులంలో ప్రోగ్రాం లో ఎక్కడ జరిగినా గాని అక్కడ ఉండి అతని ఛానల్ నందు పంపిస్తానని తుజేకులు అభివృద్ధి కొరకు కృషి చేస్తానని తెలియజేశారు. ఈరోజు  దూదేకుల సంఘం నకు  కన్వీనర్ గా  పి సాహెబ్ హో కన్వీనర్ , మాలిక్, బి కాజా హుస్సేన్ డి మౌలాలి డి శాలు భాష ఇస్మాయిల్ ట్రైలర్ హుస్సేన్. మల్ల స్వామి డి అబ్దుల్ రెహమాన్ డి పెద్ద స్వామి లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం నాకు నూర్ భాషా/ దూదేకుల కుల సంఘం వారు పాల్గొన్నారు. నూర్ భాషా/దూదేకుల  సంఘం మీటింగ్ నందు పీర్ సాహెబ్ మరియు కల్లూరు పెద్ద మస్తానయ్య లకు గౌరవంగా సన్మానం చేయడం జరిగినది.