loading
0%13,Dec-2024
చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం లోని ముగ్గురు జడ్జిల సుప్రీం కోర్టు బెంచ్ చారిత్రాత్మకమైన తీర్పు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.. ఈ బెంచ్ లో జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాధన్ ఉన్నారు..
* 1991 లో పార్లమెంట్ చేసిన "ప్లేసెస్ అఫ్ వర్షిప్ యాక్ట్ "పై ఒక నెల రోజుల్లో తమ అభిప్రాయాన్ని తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
*దేశం లోని ఏ మజీద్.. మందిర్ ల మీద కోర్టుల్లో విచారణలు జరపొద్దని తీర్పు లు ఇవ్వొద్దని ,సర్వే లు చేయొద్దని కింది కోర్టులను ఆదేశించింది.
*జ్ఞాన్ వ్యాపి, మధుర, సంభల్, అజ్మీర్ దర్గాల పై ఎలాంటి విచారణ, సర్వే లు చేయొద్దని ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ చారిత్రాత్మకమైన, సాహసోపేతమైన నిర్ణయం వల్ల దేశం లో... హిందూ.. ముస్లిం
మజీద్.. మందిర్ వివాదాలకు ఫుల్ స్టాఫ్ పడి శాంతి, భద్రతలు నియంత్రణ లోకి రానున్నాయి.
ఆర్టికల్ 141ప్రకారం సుప్రీం తీర్పు ను దేశం లోని అన్ని కోర్టులు, ప్రభుత్వ యంత్రాంగం పాటించాలి. తప్పనిసరిగా అమలు చేయాలి.
*రోజు ఏదో తవ్వాలి కూల్చాలి అనే మూకలకు ఈ తీర్పు చెంప పెట్టు లాంటింది.