loading

0%

రాజధానిలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన.

సుమారు నాలుగు గంటలపాటు పలు గ్రామాల్లో పర్యటన. 

 16 వ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానం చేసే E 11,E13 రోడ్లు నిర్మించే ప్రాంతాలు,పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి. 

వెంకట పాలెం వద్ద కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.

జధాని కోసం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు.

గత ప్రభుత్వం రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడింది.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటూ వచ్చాం.

ఇప్పటికే 22 వేల కోట్ల విలువైన టెండర్లకు అధారిటీ ఆమోదం తెలిపింది.

మరో 20 వేల కోట్లకు సోమవారం జరిగే అధారిటీ సమావేశంలో ఆమోదం తీసుకుంటాం.

217 చదరపు కి.మీ ల పరిధిలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు 16 రోడ్లు,నార్త్ నుంచి సౌత్ కి18 రోడ్లు వస్తున్నాయి.

రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం చేస్తున్నాం.

సీడ్ కేపిటల్ నుంచి E11,E13,E15 రోడ్లను జాతీయ రహదారికి కలపేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నాం.

ఈ రోడ్లలో ఎక్కువగా ఉన్న అటవీ భూమి తీసుకునే ప్రక్రియ చివరి దశకు వచ్చింది.